Manchi Kaapari Maa Prabhu - మంచి కాపరి మా ప్రభు

మంచి కాపరి మా ప్రభు యేసే

మా కొరకై ప్రాణమిచ్చె గొప్ప కాపరి   ||2||

మరణమన్నను భయము లేదులే

మధురమైన ప్రేమతో మమ్ము కాయులె  ||2||

1. పచ్చిక బయళ్లలో విశ్రమించగా

శాంతి జలాల చెంత అడుగు వేయగా   ||2||

చేయి విడువక తోడు నిలచును

అన్ని తావులందు తానే తోడై యుండును   ||2||  ||మంచి||

2. అంధకార లోయలో మయ పయనంలో-

లేదులే మాకే భయము అభయం తానే  ||2||

ఆదరించును ఆశీర్వదించును

నీతి మార్గమందు మమ్ము నడువ జేయును  ||2||  ||మంచి||

 

3. శత్రువుల మధ్యలో మాకు భోజనం

అభిషేకం ఆనందం కృపాక్షేమమే   ||2||

బ్రతుకు నిండుగా పొంగి పోర్లగా

చిరకాలం ఆయనతో జీవించగా   ||2||  ||మంచి||

 

Create Your Own Website With Webador