Manakai Yesu Maraninche - మనకై యేసు మరణించె

మనకై యేసు మరణించె

మన పాపముల కొరకై

నిత్యజీవితము నిచ్చుటకే

సత్యుండు సజీవుడాయె

1. తృణీకరింపబడె

విసర్జింపబడెను

దుఃఖా క్రాంతుడాయె

వ్యసనముల భరించెను ||మనకై యేసు||

2. మన వ్యసనముల వహించెన్ 

మన దుఃఖముల భరించెన్

మన మెన్నిక చేయకయే 

మన ముఖముల ద్రిప్పితిమి  ||మనకై యేసు||

3. మన యతిక్రమముల కొరకు 

మన దోషముల కొరకు

మన నాథుడు శిక్షనొందె 

మనకు స్వస్థత కలిగె  ||మనకై యేసు||

4. గొర్రెలవలె తప్పితిమి 

పరుగిడితిమి మనదారిన్

అరుదెంచె కాపరియై 

అర్పించి ప్రాణమును  ||మనకై యేసు||

5. దౌర్జన్యము నొందెను 

బాధింపబడెను

తననోరు తెరువలేదు 

మనకై క్రయధనమీయన్  ||మనకై యేసు||

6. ఎదిరింప లేదెవరిన్ 

లేదే కపటము నోట

యెహోవా నలుగగొట్టెన్ 

మహావ్యాధిని కలిగించెన్  ||మనకై యేసు||

7. సిలువలో వ్రేలాడెన్ 

సమాధిలో నుండెను

సజీవుండై లేచెన్ 

స్తోత్రము హల్లెలూయ  ||మనకై యేసు||

Create Your Own Website With Webador