Mahima Swaroopuda - మహిమ స్వరూపుడా


మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా

మరణపుముల్లును విరిచినవాడా

నీకే స్తోత్రములు నా యేసయ్యా

నీకే స్తోత్రములు ||2||

1. నీ రక్తమును నా రక్షణకై

బలియాగముగా అర్పించినావు

నీ గాయములద్వారా స్వస్థతనొంది

అనందించెద నీలో నేను ||2||  ||మహిమ||

2. విరిగిన మనస్సు నలిగినా హృదయం

నీ కిష్టమైన బలియాగముగా

నీ చేతితోనే విరిచిన రోట్టెనై

ఆహారమౌదును అనేకులకు ||2||  ||మహిమ||

3. పరిశుద్ధత్మ ఫలముపొంది

పరిపూర్ణమైన జ్యేష్టుల సంఘమై

సీయోను రాజా నీ ముఖము చూడ

ఆశతో నేను వేచియున్నాను ||2|| ||మహిమ||

 

Create Your Own Website With Webador