Mahaamahimatho Nindina - మహామహిమతో నిండిన

మహామహిమతో నిండిన కృపా సత్యసంపూర్ణుడా
ఇశ్రాయేలు స్తోత్రములపై ఆశీనుడా యేసయ్యా
నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్య

1. మహిమను విడిచి భువిపైకి దిగివచ్చి - కరుణతో నను పిలిచి
సత్యమును బోధించి చీకటిని తొలగించి - వెలుగుతో నింపితివి ||2||
సదయుడవై నా పాదములు తొట్రిల్లనివ్వక
స్థిరపరచి నీ కృపాలో నడిపించువాడవు ||2|| ||మహామహిమతో||

2. కరములుచాచి జలరాసులలోనుండి - నను లేవనెత్తితివి
క్షేమమును దయచేసి నను వెంబడించి అనుదినము కాచితివి ||2||
అక్షయుడా ప్రేమనుచూపి ఆదరించినావు
నిర్మాలుడా భాహువు చాపి దీవించువాడవు ||2|| ||మహామహిమతో ||

3. పదివేలలోన గుర్తించదగిన - సుందరుడవు నీవు
అపరంజి పాదములు అగ్ని నేత్రములు - కలిగిన వాడవు ||2||
ఉన్నతుడా - మహోన్నతుడా ఆరాధించెదను
రక్షకుడా - ప్రభాకరుడా నిను ఆరాధించెదను ||2|| ||మహామహిమతో ||

 

 

Create Your Own Website With Webador