Mahaaganudavu Mahonnathudavu - మహాఘనుడవు మహోన్నతుడవు

మహాఘనుడవు మహోన్నతుడవు

పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు    ||2||

కృపా సత్య సంపూర్ణమై

మా మధ్యలో నివసించుట న్యాయమా

నను పరిశుద్ధపరచుటే నీ ధర్మమా    ||2||

1. వినయముగల వారిని

తగిన సమయములో హెచ్చించువాడవని    ||2||

నీవు వాడు పాత్రనై నేనుండుటకై

నిలిచియుందును పవిత్రతతో    ||2||

హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా    ||2||    ||మహా||

2. దీన మనస్సు గలవారికే

సమృద్ధిగా కృపను దయచేయువాడవని    ||2||

నీ సముఖములో సజీవ సాక్షినై

కాపాడుకొందును మెళకువతో    ||2||

హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా    ||2||    ||మహా||

3. శోధింపబడు వారికి

మార్గము చూపించి తప్పించువాడవని    ||2||

నా సిలువ మోయుచు నీ సిలువ నీడను

విశ్రమింతును అంతము వరకు    ||2||

హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా    ||2||    ||మహా||