Madhuramainadi naa Yesu prema - మధురమైనది నా యేసు ప్రేమ

 

మధురమైనది నా యేసు ప్రేమ

మరపురానిది నా తండ్రి ప్రేమ    ||2||

మరువలేనిది నా యేసుని ప్రేమ    ||2||

మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ

ప్రేమాప్రేమా

ప్రేమానా యేసు ప్రేమా    ||2|| ||మధురమైనది||

 

1. ఇహలోక ఆశలతో అంధుడ నేనైతిని

నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని    ||2||

చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి    ||2||

నీలో నను నిలిపిన నీ ప్రేమ మధురం ||ప్రేమా||

 

2. పర్వతములు తొలగినా మెట్టలు గతి తప్పినా

ఎగసి పడే అలలతో కడలే గర్జించినా    ||2||

మరణపు ఛాయలే దరి చేరనీయక    ||2||

కౌగిట దాచిన నీ ప్రేమ మధురం ||ప్రేమా||

 

3. నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి

మార్గమును చూపి మన్నించితివి    ||2||

మరణపు ముల్లును విరచిన దేవా    ||2||

జీవము నొసగిన నీ ప్రేమ మధురం ||ప్రేమా||

 

Create Your Own Website With Webador