Kurchundunu Nee Sannidhilo - కూర్చుందును నీ సన్నిధిలో
కూర్చుందును నీ సన్నిధిలో – దేవా ప్రతి దినం
ధ్యానింతును నీ వాక్యమును – దేవా ప్రతి క్షణం ||2||
నిరంతరం నీ నామమునే గానము చేసెదను
ప్రతి క్షణం నీ సన్నిధినే అనుభవించెదను ||కూర్చుందును||
1. ప్రతి విషయం నీకర్పించెదా
నీ చిత్తముకై నే వేచెదా ||2||
నీ స్ఫూర్తిని పొంది నే సాగెదా ||2||
నీ నామమునే హెచ్చించెదా ||2||
నా అతిశయము నీవే – నా ఆశ్రయము నీవే
నా ఆనందము నీవే – నా ఆధారము నీవే
యేసూ యేసూ యేసూ యేసూ.. ||కూర్చుందును||
2. ప్రతి దినము నీ ముఖ కాంతితో
నా హృదయ దీపం వెలిగించెదా ||2||
నీ వాక్యానుసారము జీవించెదా ||2||
నీ ఘన కీర్తిని వివరించెదా ||2||
నా దుర్గము నీవే – నా ధ్వజము నీవే
నా ధైర్యము నీవే – నా దర్శనం నీవే
యేసూ యేసూ యేసూ యేసూ.. ||కూర్చుందును||
Create Your Own Website With Webador