Krupathappa verokati ledhayaa - కృపతప్ప వేరొకటి లేదయా

కృపతప్ప వేరొకటి లేదయా

నీ కృపతప్ప వేరెవరు యేసయ్యా

కృపయే కదా నా ఆశ్రయము

నీ కృపయే కదా నా పరవశము

1. నిలువున రేగిన తుఫానులో

నడిపెను నిలిపెను నీ కృపయే ||2||

నా ఎడ చెలరేగె నీ కృపయే ||2||  ||కృప||

2. నీ కృప నన్ను విడువనిదీ

నీ కృపయే ఎడబాయనిది  ||2||

నిత్యము నిలుచును నీ కృపయే ||2||  ||కృప||

3. అణువణువునను నీ కృపయే

నా అడుగడుగునను నీ కృపయే  ||2||

నా యెడ కురిసేను నీ కృపయే ||2||  ||కృప||