Krupalanu Thalanchuchu - కృపలను తలంచుచు

కృపలను తలంచుచు ||2||

ఆయుష్కాలమంతా ప్రభుని

కృతజ్ఞతతో స్తుతింతున్ ||2|| ||కృపలను||


1.మిమ్మును ముట్టిన వాడు

నా కంటిపాపను ||2||
ముట్టునని సెలవిచ్చిన దేవుడు

కాచెను గతకాలం నన్ను  ||2|| |కృపలను||

2.రూపింపబడుచున్న

ఆయుధం ఉండినను||2||

నాకు విరోధమై వర్ధిల్లదు అని

చెప్పిన మాట సత్యం ప్రభువు  ||2|| |కృపలను||

3.కన్నీటి లోయలలో నే

కృంగిన వేళలలో||2||

నింగిని చీల్చి వర్షము పంపి

నింపెను నా హృదయం యేసు  ||2|| |కృపలను||

4.సర్వోన్నతుడైన నా

దేవునితో చేరి||2||

సతతము తన కృప వెల్లడి చేయ

స్తుతులతో నింపెనుఇలలో  ||2|| ||కృపలను||

5.హల్లెలూయా ఆమెన్

నాకెంతో ఆనందమే 

సీయోన్ నివాసము నాకెంతో ఆనందం

ఆనందంమానందమే ఆమెన్ ||2|| ||కృపలను||