Krupaa Sathya Sampoornuda - కృపా సత్య సంపూర్ణుడా
కృపా సత్య సంపూర్ణుడా
సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా ||2||
నా సన్మానానికే మహనీయుడవు నీవేనయా ...
మహనీయుడవు నీవేనయా ...
1. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా
దాటిరే నీ జనులు బహు క్షేమముగా ||2||
ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే ||2|| ||కృపా||
2. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయ్యగా
నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా ||2||
నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే ||2|| ||కృపా||
3. నైవేద్యములు, దహన బలులు నీవు కోరవుగా
నా ప్రాణాత్మ శరీరము బలిఅర్పణ కాగా ||2||
నా జిహ్వబలులు, స్తోత్ర బలులుగ మారిపోయెనే ||2|| ||కృపా||
Create Your Own Website With Webador