Krupaa Kshemamu - కృపా క్షేమము
కృపా క్షేమము నీ శాశ్వత జీవము
నా జీవిత కాలమంతయు
నీవు దయచేయువాడవు ||2||
మహోన్నతమైన నీ ఉపకారములు
తలంచుచు అనుక్షణము పరవశించనా
నీ కృపలోనే పరవశించనా
1. నా ప్రతి ప్రార్ధనకు
నీవిచ్చిన ఈవులే
లెక్కకు మించిన దీవెనలైనాయి ||2||
అడుగులు తడబడక
నడిపినది నీ దివ్య వాక్యమే
కడలిని మించిన విశ్వాసమునిచ్చి
విజయము చేకూర్చెను ||2||
నీ వాక్యమే మకరంధమై
బలపరిచెను నన్ను
నా యేసయ్య స్తుతిపాత్రుడ
ఆరాధన నీకే ||2||
ఆరాధన నీకే ||కృపా క్షేమము||
2. నీ సత్య మార్గములో
ఫలించిన అనుభవమే
పరిమళింపచేసి సాక్షిగ నిలిపాయి ||2||
కలతచెందక నిలిపినది
నీ దివ్య దర్శనమే
గమ్యము చేరే శక్తితో నను నింపి
నూతన కృపనిచ్చెను ||2||
ఆరాధ్యుడా అభిషిక్తుడా
ఆరాధన నీకే
నా యేసయ్య స్తుతిపాత్రుడ
ఆరాధన నీకే ||2||
ఆరాధన నీకే ||కృపా క్షేమము||
Create Your Own Website With Webador