Krupaa Krupaa Sajeevulatho - కృపా కృపా సజీవులతో
కృపా - కృపా సజీవులతో
నను నిలిపినది నీ కృపా ||2||
నా శ్రమదినమున నాతో నిలిచి
నను ఓదార్చిన నవ్యకృప నీదు కృప ||2||
కృపా సాగర మహోనాతమైన
నీ కృపా చాలుయా || కృపా||
1. శాశ్వతమైన నీ ప్రేమతో
నను ప్రేమించిన శ్రీకరుడా
నమ్మకమైన నీ సాక్షినై నే
నీ దివ్య సన్నిధిలో నన్నొదిగిపోని ||2||
నీ ఉపదేశమే నాలో ఫలబరితమై
నీ కమనియ కాంతులను విరజిమ్మెనే ||2||
నీ మహిమను ప్రకటింప
నను నిలిపేనే || కృపా||
2. గాలితుఫానుల అలజడితో
గూడుచెదరిన గువ్వవలే
గమ్యమును చూపే నిను వేడుకొనగా
నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించితివి ||2||
నీ వాత్యల్యమే నవ వసంతము
నా జీవిత దినములు ఆద్యంతము ||2||
ఒక్క క్షణమైన విడువని
ప్రేమామృతము ||కృపా||
3. అత్యునతమైన కృపలతో
ఆత్మఫలము సంపదలతో
అతిశ్రేష్టమైన స్వాస్త్యమును పొంది
నీ ప్రేమ రాజ్యములో హర్షించువేళ ||2||
నా హృదయార్పణ నిను మురిపించని
నీ రుణాతిశయములను కీర్తించని ||2||
ఈ నీరీక్షణ నాలో నేరవని || కృపా||
Create Your Own Website With Webador