Kalyanam Kamaneeyam - కళ్యాణం కమనీయం
కళ్యాణం కమనీయం
ఈ సమయం అతి మధురం
దేవా రావయ్యా
నీ దీవెనలీవయ్యా ||2||
1. ఏదెను వనమున యెహోవ దేవా
మొదటి వివాహము చేసితివే ||2||
ఈ శుభ దినమున - నవ దంపతులను
నీ దీవెనలతో నింపుమయా||2|| ||కళ్యాణం||
2. కానా విందులో అక్కర నెరిగి
నీళ్ళను రసముగ మార్చితివే ||2||
కష్టములలో నీవే - అండగా నుండి
కొరతలు తీర్చి నడుపుమయా ||2|| ||కళ్యాణం||
Create Your Own Website With Webador