Junte thene dhaarala kanna - జుంటె తేనె ధారల కన్నా
జుంటె తేనె ధారల కన్నా
యేసు నామమే మధురం
యేసయ్య సన్నిధినే మరువజాలను ||2||
జీవితకాలమంతా ఆనందించెదా
యేసయ్యనే ఆరాధించెదా ||2|| ||జుంటె తేనె||
1. యేసయ్య నామమే బహు పూజనీయము
నాపై దృష్టి నిలిపి సంత్రుష్టిగా నను ఉంచి ||2||
నన్నెంతగానో దీవించి
జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే ||2|| ||జుంటె తేనె||
2. యేసయ్య నామమే బలమైన దుర్గము
నా తోడై నిలిచి క్షేమముగా నను దాచి ||2||
నన్నెంతగానో కరుణించి
పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే ||2|| ||జుంటె తేనె||
3. యేసయ్య నామమే పరిమళ తైలము
నాలో నివసించే సువాసనగా నను మార్చి ||2||
నన్నెంతగానో ప్రేమించి
విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే ||2|| ||జుంటె తేనె||
Create Your Own Website With Webador