Intha kaalam Needu krupalo - ఇంత కాలం నీదు కృపలో

ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా ||2||

ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా ||2||         ||ఇంత కాలం||

1. ఎన్ని ఏళ్ళు గడచినా

ఎన్ని తరాలు మారినా ||2||

మారని వీడని ప్రేమే నీదయ్యా

మార్చిన నా జీవితం నీకే యేసయ్యా ||2||         ||ఇంత కాలం||

2. నీవు చేసిన మేలులు

తలచుకుందును అనుదినం ||2||

నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా

వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా ||2||           ||ఇంత కాలం||

3. దూరమైతిరి ఆప్తులు

విడచిపోతిరి నా హితులు ||2||

శోధన వేదన తీర్చిన యేసయ్యా

తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా ||2||           ||ఇంత కాలం||