Innelugaa Kanniru thudichi - ఇన్నేళ్లుగా కన్నీరు తుడిచి

ఇన్నేళ్లుగా కన్నీరు తుడిచి

కాపాడిన ప్రభువా ||2||

శోధన సమయములోనా...

వేదన కాలములోనా ... ||2||

1. జడివానలూ సుడిగాలులూ

కురిసాయి నా బ్రతుకులోనా ||2||

నా చెంత చెరీ - చేయూత నిచ్చి ||2||

కాపాడిన ప్రభువా

మమ్ము  కాపాడిన ప్రభువా ||ఇన్నేళ్లుగా||

2. నా వారలే వెలివేసిన

పగవారు తలలూచినా ||2||

నీ దరికీ చేర్చి - ఓదార్పు నిచ్చి ||2||

ననాదరించవు ప్రభువా

నీవు ననాదరించవు ప్రభువా  ||ఇన్నేళ్లుగా||

3. సాతానుడు శోదించగా

నా దేవ జయమిచ్చినావూ ||2||

పలుమారులు ప్రార్ధించగా ||2||

పడకుండ కాపాడినావు

నన్ను పడకుండ కాపాడినావు  ||ఇన్నేళ్లుగా||