Goppa Devudavani - గొప్ప దేవుడవని

గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని

గళమెత్తి నిన్ను నేను గానమాడెదన్

రాజుల రాజువని రక్షణ దుర్గమని

నీ కీర్తిని నేను కొనియాడెదన్

హల్లెలూయా నా యేసునాథా

హల్లెలూయా నా ప్రాణనాథా ||2||    ||గొప్ప||

1. అద్భుత క్రియలు చేయువాడని

ఆశ్చర్య కార్యాలు చేయగలడని ||2||

అద్వితీయుడవని ఆదిసంభూతుడని

ఆరాధించెద నిత్యం నిన్ను ||2||      ||హల్లెలూయా||

2. సాగరాన్ని రెండుగా చేసినాడని

సాతాను శక్తులను ముంచినాడని ||2||

సర్వోన్నతుడవని సర్వ సంపన్నుడని

సాక్ష్య గీతం నే పాడెదన్ ||2||       ||హల్లెలూయా||