Ghanamainavi nee karyamulu - ఘనమైనవి నీ కార్యములు
ఘనమైనవి నీ కార్యములు నా యెడల
స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా ||2||
కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి
స్తుతులర్పించెదను అన్నివేళలా ||2||
అనుదినము నీ అనుగ్రహమే
ఆయుష్కాలము నీ వరమే ||2|| ||ఘనమైనవి||
1. యే తెగులు సమీపించనీయక
యే కీడైన దరిచేరనీయక
ఆపదలన్ని తొలగే వరకు
ఆత్మలో నెమ్మది కలిగే వరకు ||2||
నా భారము మోసి – బాసటగా నిలిచి
ఆదరించితివి
ఈ స్తుతి మహిమలు నీకే – చెల్లించెదను
జీవితాంతము ||ఘనమైనవి||
2. నాకు ఎత్తైన కోటవు నీవే
నన్ను కాపాడు కేడెము నీవే
ఆశ్రయమైన బండవు నీవే
శాశ్వత కృపకాధారము నీవే ||2||
నా ప్రతిక్షణమును నీవు – దీవెనగా మార్చి
నడిపించుచున్నావు
ఈ స్తుతి మహిమలు నీకే – చెల్లించెదను
జీవితాంతము ||ఘనమైనవి||
3. నీ కృప తప్ప వేరొకటి లేదయా
నీ మనసులో నేనుంటే చాలయా
బహు కాలముగా నేనున్న స్థితిలో
నీ కృప నా యెడ చాలునంటివే ||2||
నీ అరచేతిలో నను – చెక్కుకుంటివి
నాకేమి కొదువ
ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను
జీవితాంతము ||ఘనమైనవి||
Create Your Own Website With Webador