Entha Krupaamayudavu Yesayya - ఎంత కృపామయుడవు యేసయ్యా
ఎంత కృపామయుడవు యేసయ్యా
(నీ) ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా ||2||
నలిగితివి వేసారితివి ||2||
నాకై ప్రాణము నిచ్చితివి ||2|| ||ఎంత||
1. బండలాంటిది నాదు మొండి హృదయం
ఎండిపోయిన నాదు పాత జీవితం ||2||
మార్చినావు నీ స్వాస్థ్యముగా ||2||
ఇచ్చినావు మెత్తనైన కొత్త జీవితము ||2|| ||ఎంత||
2. కన్న తల్లి తండ్రి నన్ను మరచిననూ
ఈ లోకము నన్ను విడచిననూ ||2||
మరువలేదు నన్ను విడువలేదు ||2||
ప్రేమతో పిలచిన నాథుడవు ||2|| ||ఎంత||
Create Your Own Website With Webador