Enni Thalachina Edi Adigina - ఎన్ని తలచినా ఏది అడిగినా
ఎన్ని తలచినా ఏది అడిగినా
జరిగేది నీ చిత్తమే ||2|| ప్రభువా
నీ వాక్కుకై వేచియుంటిని
నా ప్రార్థన ఆలకించుమా ||2|| ప్రభువా
1. నీ తోడు లేక నీ ప్రేమ లేక
ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు ||2||
అడవి పూవులే నీ ప్రేమ పొందగా ||2||
నా ప్రార్థన ఆలకించుమా ||2|| ప్రభువా ||ఎన్ని||
2. నా ఇంటి దీపం నీవే అని తెలసి
నా హృదయం నీ కొరకై పదిలపరచితి ||2||
ఆరిపోయిన నా వెలుగు దీపము ||2||
వెలిగించుము నీ ప్రేమతో ||2|| ప్రభువా ||ఎన్ని||
3. ఆపదలు నన్ను వెన్నంటియున్నా
నా కాపరి నీవై నన్నాదుకొంటివి ||2||
లోకమంతయూ నన్ను విడచినా ||2||
నీ నుండి వేరు చెయ్యవు ||2|| ప్రభువా ||ఎన్ని||
4. నా స్థితి గమనించి నన్నూ ప్రేమించి
నా కొరకై కల్వరిలో యాగమైతివి ||2||
నీదు యాగమే నా మోక్ష మార్గము ||2||
నీయందే నిత్యజీవము ||2|| ప్రభువా ||ఎన్ని||
Create Your Own Website With Webador