Enduko Nanninthaga Neevu - ఎందుకో నన్నింతగా నీవు

ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా

అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా ||2||

1. నా పాపము బాప నరరూపివైనావు

నా శాపము మాప నలిగి వ్రేలాడితివి

నాకు చాలిన దేవుడవు నీవే

నా స్థానములో నీవే ||2||         ||ఎందుకో||

2. నీ రూపము నాలో నిర్మించియున్నావు

నీ పోలికలోనే నివసించుమన్నావు

నీవు నన్ను ఎన్నుకొంటివి

నీ కొరకై నీ కృపలో ||2||           ||ఎందుకో||

3. నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు

నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు

నన్ను నీలో చూచుకున్నావు

నను దాచియున్నావు ||2||       ||ఎందుకో||

4. నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే

నా మనుగడ ముందే నీ గ్రంథములోనుండే

ఏమి అద్భుత ప్రేమ సంకల్పం

నేనేమి చెల్లింతున్ ||2||             ||ఎందుకో||

Create Your Own Website With Webador