Ee roju sajeevuniga - ఈ రోజు సజీవునిగా

రోజు సజీవునిగా నీలో జీవింప చేసితివే

కృతజ్ఞత స్తుతి చెల్లింతునయ్యా

నిత్యమూ నీసన్నిధిలో ||2||

1. ఆకర్షించేను నీప్రేమ నన్ను

సుందరుడా మనోహరుడా ||2||

యేసయ్య నీ ప్రేమలోనే -

మనసుకి నెమ్మది - ఆదరణ దొరికే ||2||

హల్లెలూయా - హల్లెలూయా || రోజు||

2. మరుగైయున్న పరలోక సంగతులు -

పామరుడను నాకు తెలియజేసితివి ||2||

ఆత్మదీపం వెలిగించి నాలో -

నీతో నడచుటకు - కృపచూపితివే ||2||

హల్లెలూయా - హల్లెలూయా || రోజు||

3. నూతన యెరూషలేము నా నివాసమని -

నూతన సృష్టిగా నన్ను మార్చినావు ||2||

నూతన వధువుగా సిద్ధపడుచు -

ఎదురుచూస్తూ - జీవింతునయ్యా ||2||

హల్లెలూయా - హల్లెలూయా || రోజు||

Create Your Own Website With Webador