Dhanyamu Entho Dhanyamu - ధన్యము ఎంతో ధన్యము
ధన్యము ఎంతో ధన్యము – యేసయ్యను కలిగిన జీవితము ||2||
ఇహమందున పరమందున – నూరు రెట్లు ఫలముండును ||2||
వారె ధన్యులు – వారెంతో ధన్యులు ||2|| ||ధన్యము||
1. ఎవరి అతిక్రమములు – పరిహరింపబడెనో ||2||
ఎవరి పాపములు – మన్నించబడెనో ||2|| ||వారె ధన్యులు||
2. క్రీస్తు యేసుకు సమర్పించు – కరములే కరములు ||2||
క్రీస్తుయేసు స్వరము విను – వీనులే వీనులు ||2|| ||వారె ధన్యులు||
3. ప్రభు యేసుని సేవచేయు – పాదములే సుందరములు ||2||
ప్రభుని గూర్చి పాటపాడు – పెదవులే పెదవులు ||2|| ||వారె ధన్యులు||
4. ఆత్మలో నిత్యము – ఎదుగుచున్న వారును ||2||
అపవాది తంత్రములు – గుర్తించు వారును ||2|| ||వారె ధన్యులు||
5. శ్రమలయందు నిలచి – పాడుచున్న వారును ||2||
శత్రు బాణములెల్ల – చెదరగొట్టు వారును ||2|| ||వారె ధన్యులు||
Create Your Own Website With Webador