Dhaaveedhu Kumaaruda - దావీదు కుమారుడా

దావీదు కుమారుడా - నను దాటిపొకయా

నజరేతువాడా - నను విడిచిపోకయా

నీవు తప్ప నాకీలోకంలో ఎవరున్నారయా

నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా

1. గ్రుడ్డి వాడినయ్యా - నా కనులు తెరువవా

మూగవాడినయ్యా - నా స్వరము నియ్యవా ||2||

కుంటి వాడినయ్య - నా తోడు నడువవా ||2|| ||దావీదు||


2.
లోకమంత చూసి - నను ఏడిపించినా

జాలితో నన్ను - నీవు చేరదీయవా ||2||

ఒంటరి నయ్యా - నాతోడు నిలువవా  ||2|| ||దావీదు||

3. నా తల్లి నన్ను - మరచిపోయిన

నా తండ్రి నన్ను - విడిచిపోయిన  ||2||

తల్లితండ్రి నీవై నను లాలించుమా  ||2||  ||దావీదు||

Create Your Own Website With Webador