Devuni yandu Neerikshana nunchi - దేవునియందు నిరీక్షణ నుంచి
దేవునియందు నిరీక్షణ నుంచి
ఆయనను స్తుతించు నా ప్రాణమా ||2||
1. ఏ అపాయము రాకుండ నిన్ను
దివారాత్రులు కాపాడువాడు ||2||
ప్రతిక్షణం – నీ పక్షముండు – రక్షకుడు ||2|| ||దేవుని||
2. చీకటిని వెలుగుగా చేసి
ఆయన నీ ముందు పోవువాడు ||2||
సత్యమగు – జీవమగు – మార్గమేసే ||2|| ||దేవుని||
3. తల్లి తన బిడ్డను మరచిననూ
మరువడు నీ దేవుడు నిన్ను ||2||
తల్లికన్నా – తండ్రికన్నా – ఉత్తముడు ||2|| ||దేవుని||
4. నీకు సహాయము చేయువాడు
సదా ఆదుకొను వాడు ఆయనే ||2||
ఆధారము – ఆదరణ – ఆయనలో ||2|| ||దేవుని||
5. నీకు విరోధముగా రూపించిన
ఏ విధ ఆయుధమును వర్ధిల్లదు ||2||
శత్రువులు – మిత్రులుగా – మారుదురు ||2|| ||దేవుని||
6. పర్వతములు తొలగి పోయిననూ
తన కృప నిన్ను ఎన్నడు వీడదు ||2||
కనికర – సంపన్నుడు – నా దేవుడు ||2|| ||దేవుని||
7. స్తుతి మహిమలు నీకే ప్రభు
నిత్యము నిన్నే కొనియాడెద ||2||
హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ ||2|| ||దేవుని||
Create Your Own Website With Webador