Bajiyinthumu ninu Jagadeesa - భజియింతుము నిను జగదీశా
భజియింతుము నిను జగదీశా శ్రీ
యేసా మా రక్షణ కర్తా ||2||
శరణు శరణు మా దేవా యెహోవా
మహిమాన్విత చిర జీవనిధి ||2|| ||భజియింతుము||
1. విమల సెరాపులు దూత గణంబులు
చూడగ లేని తేజోనిధివే ||2||
మా యధములకై సిలువ మ్రానుపై
దీనుడవై మరణించితివే ||2|| ||శరణు||
2. ప్రప్రధముడ మరి కడపటి వాడా
మృతుడై బ్రతికిన నిరత నివాసి ||2||
నీ భజనలు మా జీవనాధారం
చేకొనవే మా స్తుతి గీతం ||2|| ||శరణు||
Create Your Own Website With Webador