Bahu Soundarya Siyonulo - బహు సౌందర్య సీయోనులో

బహు సౌందర్య సీయోనులో
స్తుతిసింహాసనాసీనుడా ||2||
నాయేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై
హృదయాన కొలువాయెనే  
ననుజీవింపజేసే నీవాక్యమే
నాకిలలోన సంతోషమే  ||బహు సౌందర్య||

1. పరిశుద్ధతలో మహనీయుడవు
నీవంటిదేవుడు జగమునలేడు ||2||
నాలోనిరీక్షణ - నీలో సంరక్షణ
నీకే నాహృదయార్పణ ||2||  ||బహు సౌందర్య||

2.ఓటమినీడలో క్షేమములేక
వేదనకలిగిన వేళలయందు ||2||
నీవు చూపించిన నీవాత్సల్యమే
నాహృదయాన నవజ్ఞాపిక ||2||  ||బహు సౌందర్య||

3.ఒంటరిబ్రతుకులో కృంగినమనసుకు
చల్లని నీచూపే ఔషధమే ||2||
ప్రతి అరుణోదయం నీముఖదర్శనం
నాలోనింపెను ఉల్లాసమే ||2||  ||బహు సౌందర్య||