Baasillenu Siluvalo Paapakshama - భాసిల్లెను సిలువలో పాపక్షమా

భాసిల్లెను సిలువలో పాపక్షమా

యేసు ప్రభూ నీ దివ్య క్షమా      ||భాసిల్లెను||

1. కలువరిలో నా పాపము పొంచి

సిలువకు నిన్ను యాహుతి చేసి

కలుషహరా కరుణించితివి ||2||      ||భాసిల్లెను||

2. దోషము చేసినది నేనెకదా

మోసముతో బ్రతికిన నేనెకదా

మోసితివా నా శాపభారం ||2||     ||భాసిల్లెను||

3. పాపము చేసి గడించితి మరణం

శాపమెగా నేనార్జించినది

కాపరివై నను బ్రోచితివి ||2||     ||భాసిల్లెను||

4. ఎందులకో నాపై ప్రేమ

అందదయ్యా స్వామీ నా మదికి

అందులకే భయమొందితిని ||2||     ||భాసిల్లెను||

5. నీ మరణపు వేదన వృధా గాదు

నా మది నీ వేదనలో మునిగెను

క్షేమము కలిగెను హృదయములో ||2||     ||భాసిల్లెను||

6. నమ్మిన వారిని కాదన వనియు

నెమ్మది నొసగెడి నా ప్రభుడవని

నమ్మితి నీ పాదంబులను ||2||      ||భాసిల్లెను||