Amarudavu neevu naa Yesayya - అమరుడవు నీవు నాయేసయ్యా

అమరుడవు నీవు నాయేసయ్యా

ఆదియు అంతము నీవేనయ్యా ||2||

ఆదిలోనున్న నీ వాక్యమే

ఆదరించెను శ్రమకొలిమిలో ||2||

సొమ్మసిల్లక - సాగిపోదును - సీయోను మార్గములో

స్తోత్రగీతము - ఆలపింతును - నీదివ్య సన్నిధిలో   ||అమరుడవు||

1. శక్తికి మించిన సమరములో - నేర్పితివి నాకు నీ చిత్తమే

శిక్షకు కావే శోధనలన్నీ - ఉన్నత కృపతో నను నింపుటకే ||2||

ప్రతి విజయము నీకంకితం - నాబ్రతుకే నీ మహిమార్థం

లోకమంతయు - దూరమైనను - నను చేరదీసెదవు

దేహమంతయు - ధూళియైనను - జీవింపజేసెదవు ||అమరుడవు||

2. వేకువకురిసిన చిరుజల్లులో - నీకృప నాలో ప్రవహించగా -

పొందితినెన్నో ఉపకారములు - నవనూతనమే ప్రతిదినము ||2||

తీర్చగలనా నీ ఋణమును - మరువగలనా నీ ప్రేమను

కన్నతండ్రిగ - నన్ను కాచి - కన్నీరు తుడిచితివి

కమ్మనైన - ప్రేమ చూపి - కనువిందు చేసితివి ||అమరుడవు||

3. జల్దరు వృక్షమును పోలిన - గుణశీలుడవు నీవేనయ్యా

మరణము గెలిచిన పరిశుద్ధుడవు - పునరుత్థానుడవు నీవయ్యా||2||

జయశీలుడవు నీవేనని - ఆరాధింతును ప్రతి నిత్యము

గుండె గుడిలో - నిండినావు - నీకే ఆరాధన

ఆత్మదీపము - వెలిగించినావు - నీకే ఆరాధన ||అమరుడవు||