Alpha Omegayaina - అల్ఫా ఓమేగయైన

అల్ఫా ఓమేగయైన మహిమాన్వితుడా

అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రార్హుడా ||2||

రాత్రిలో కాంతి కిరణమా! పగటిలో కృపా నిలయమా!

ముదిమి వరకు నన్నాదరించే సత్య వాక్యమా

నాతో స్నేహమైనా సౌఖ్యమై నను నడిపించే నా యేసయ్యా ||2||

1 .కనికర పూర్ణుడా! నీ కృప బాహుల్యమే

ఉన్నతముగ నిను ఆరాధించుటకు

అనుక్షణమున నీ ముఖ కాంతి లో నిలిపి  

నూతన వసంతములో చేర్చును ||2||

జీవించెద నీ కొరకేహర్షించెద నీ లోనే  ||2||  ||అల్ఫా||

2 తేజోమయుడా! నీ దివ్య సంకల్పమే

ఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకు

ఆశా నిరాశల వలయాలు తప్పించి

అగ్ని జ్వాలగ నను చేసెను ||2||  

నా స్తుతి కీర్తన నీవేస్తుతి ఆరాధన నీకే ||2||   ||అల్ఫా||

3 నిజ స్నేహితుడా! నీ స్నేహ మాధుర్యమే

శుభ సూచనగా నను నిలుపుటకు

అంతు లేని అగాధాలు దాటించి

అందని శిఖరాలు ఎక్కించెను ||2||  

నా చెలిమి నీతోనేనా కలిమి నీలోనే  ||2||  ||అల్ఫా||

Create Your Own Website With Webador