Ae thegulu Nee Gudaaramu - ఏ తెగులు నీ గుడారము
ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా
అపాయమేమియు రానే రాదు రానే రాదయ్యా ||2||
లలల్లాలాలల్లా లలల్లాలాలల్లా
లలల్లాలాలల్లా లలల్లా ||2||
1. ఉన్నతమైన దేవుని నీవు
నివాసముగా గొని
ఆశ్చర్యమైన దేవుని నీవు
ఆధార పరచితివి ||2|| ||ఏ తెగులు||
2. గొర్రెపిల్ల రక్తముతో
సాతానున్ జయించితిని
ఆత్మతోను వాక్యముతో
అనుదినము జయించెదను ||2|| ||ఏ తెగులు||
3. దేవుని కొరకై మన ప్రయాసములు
వ్యర్ధము కానేకావు
కదలకుండా స్థిరముగా
ప్రయాస పడేదాము ||2|| ||ఏ తెగులు||
4. మన యొక్క నివాసము
పరలోక-మందున్నది
రానైయున్న రక్షకుని
ఎదుర్కొన సిద్ధపడుమా ||2|| ||ఏ తెగులు||
Create Your Own Website With Webador