Aashraya durgama naa yesayya - ఆశ్రయదుర్గమా నా యేసయ్యా

ఆశ్రయదుర్గమానా యేసయ్యా

నవజీవన మార్గమునానన్ను నడిపించుమా

ఊహించలేనే నీ కృపలేని క్షణమును

కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే             ||ఆశ్రయ||

 

1. లోక మర్యాదలు మమకారాలు గతించి పోవునే

ఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే (2)

అందుకే స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి (2)             ||ఆశ్రయ||

 

2. నాతో నీవు చేసిన నిబంధనలన్నియు నెరవేర్చుచుంటివే

నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే (2)

అందుకే స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి (2)             ||ఆశ్రయ||

 

3. పరవాసినైతిని వాగ్ధానములకు వారసత్వమున్నను

నీ శిక్షణలో అనుకవతోనే నీకృ పొందెద (2)

అందుకే స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి (2)             ||ఆశ్రయ||

 

4. నిత్య నివాసినై నీ ముఖము చూచుచు పరవశించెదనే

నిరీక్షణయే ఉత్తేజము నాలో కలిగించుచున్నది (2)

స్తుతి ఘన మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా

హల్లేలూయాహల్లేలూయాహల్లెలూయా (2)             ||ఆశ్రయ||