Aascharyamaina prema - ఆశ్చర్యమైన ప్రేమ



ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ

మరణము కంటె బలమైన ప్రేమది

నన్ను జయించె నీ ప్రేమ ||2||        ||ఆశ్చర్యమైన||

 

1. పరమును వీడిన ప్రేమ 

ధరలో పాపిని వెదకిన ప్రేమ

నన్ను కరుణించి ఆదరించి 

సేదదీర్చి నిత్య జీవమిచ్చే         ||ఆశ్చర్యమైన||


2. పావన యేసుని ప్రేమ 

సిలువలో పాపిని మోసిన ప్రేమ

నాకై మరణించి జీవమిచ్చి 

జయమిచ్చి తన మహిమ నిచ్చే         ||ఆశ్చర్యమైన||


3. శ్రమలు సహించిన ప్రేమ 

నాకై శాపము నోర్చిన ప్రేమ

విడనాడని ప్రేమది 

ఎన్నడూ యెడబాయని ప్రేమా         ||ఆశ్చర్యమైన||

4. నా స్థితి జూచిన ప్రేమ

నాపై జాలిని జూపిన ప్రేమ

నాకై పరుగెత్తి కౌగలించి

ముద్దాడి కన్నీటిని తుడిచే         ||ఆశ్చర్యమైన||


Create Your Own Website With Webador