Aaradhinchutaku nee naamame - ఆరాధించుటకు నీ నామమే

ఆరాధించుటకు నీ నామమేగాక

వేరొక నామము లేదాయే

యేసయ్య...

తరతరములకు నీవే మాదేవుడవు

1. నీ నామమున ప్రార్ధన చేయు

జనులను విడిపించి నడిపించినావు ||2||

పాలుతేనెలు ప్రవహించు దేశములో

క్షేమముగానే నివసింపచేసితివి ||2||

నమ్మదగిన దేవుడవు నీవే

సాటిలేరు ఇలలో నీకెవ్వరూ ||2||  ||ఆరాధించుటకు||

2. కాలములో పరజనులము మేము

నిజమైన దేవుని ఎరుగనివారము ||2||

కృపాకాలములో ప్రభువా

నీ రక్తము ద్వారా సంధి చేసితివి ||2||

తండ్రితో మేము ఐక్యపరచితివి

నిబంధన జనులని ముద్రవేసితివి ||2|| ||ఆరాధించుటకు||

3. నీ సంఘములో స్తుతి ఆరాధనలో

రుచిచూపితివి పరిశుద్దాత్మను ||2||

నాలో నివసించి నాతోడుగా నడిచే

పరిశుద్దాత్ముని ఆదరణ పొందితిని ||2||

ఇహపరమందున ఇక నా సహవాసము

తండ్రి కుమార పరిశుద్దాత్మునితో ||2||  ||ఆరాధించుటకు||