Aanandinthu neelo deva - ఆనందింతు నీలో దేవా

ఆనందింతు నీలో దేవా
అనుదినం నిను స్తుతించుచు ||2||
మధురమైన నీ నామమునే ||2||
మరువక ధ్యానించెద ప్రభువా ||ఆనందింతు||

1. ఆత్మ నాథా అదృశ్య దేవా
అఖిల చరాలకు ఆధారుండా ||2||
అనయము నిను మది కొనియాడుచునే
ఆనందింతు ఆశ తీర ||2|| ||ఆనందింతు||

2. నాదు జనములు నను విడచినను1
నన్ను నీవు విడువకుండా ||2||
నీ కను దృష్టి నాపై నుంచి
నాకు రక్షణ శృంగమైన ||2|| ||ఆనందింతు||

3. శ్రేష్ఠమగు నీ స్వాస్థ్యము కొరకు
మేఘమందు రానైయున్న ||2||
ఆ ఘడియ ఎప్పుడో ఎవరికి తెలుసు
అంతం వరకును భద్రపరచుము ||2|| ||ఆనందింతు||

4. శ్రమలు నన్ను చుట్టిన వేళ
చింతలో కృశించిన వేళ ||2||
అభయముగా నీ దర్శనమిచ్చి
శ్రమలు బాపి శాంతినిచ్చితివి ||2|| ||ఆనందింతు||

 

 

Create Your Own Website With Webador