Aanandame Paramaanandame - ఆనందమే పరమానందమే

ఆనందమే పరమానందమే

ఆశ్రయపురమైన యేసయ్యా నీలో    ||2||

ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన

అక్షయుడా నీకే స్తోత్రము    ||2||  ||ఆనందమే||

1. పచ్చిక గల చోట్ల పరుండ జేసితివే

జీవ జలములు త్రాగనిచ్చితివే    ||2||

నా ప్రాణమునకు సేదదీర్చితివి

నీతియు శాంతియు నాకిచ్చితివే    ||2||   ||ఆనందమే||

2. గాఢాంధకారము లోయలలో నేను

సంచరించినా దేనికి భయపడను    ||2||

నీ దుడ్డు కఱ్ఱయు నీ దండమును

అనుదినం అనుక్షణం కాపాడునే    ||2||   ||ఆనందమే||

3.నా శత్రువుల ఎదుటే నీవు

నాకు విందును సిద్ధము చేసావు    ||2||

నీతో నేను నీ మందిరములో

నివాసము చేసెద చిరకాలము    ||2||  ||ఆనందమే||

Create Your Own Website With Webador