Aakarshinchumu Devaa - ఆకర్షించుము దేవా
ఆకర్షించుము దేవా మమ్మాదరింపగ రావా
కాంక్షనీయుడా నీవే మా దేవ - కాపరి మా యేసు దేవా
1. సాతాను శోధనలు మములాగుచున్నవి దేవా
కష్టాలు కన్నీళ్ళు మా గుండె నిండెను దేవా ||2||
లోకము మమ్ము పిలుచుచున్నది
శోకసముద్రం పొంగుచున్నది ||2|| ||ఆకర్షించుము||
2. నీ ఆత్మ వరములను మాకిమ్ము మా యేసు దేవ
నీ సేవ చేయుటకు మా శక్తి చాలదు దేవా ||2||
సుఖము శరీరము కోరుచున్నది
మనస్సు ధనాశకు లాగుచున్నది ||2|| ||ఆకర్షించుము||
3. మా ప్రియుడా నడుపుమయా - నీ ప్రేమ నీడలలోన
పాలు గోధుమ సారములు ఉన్నాయి - నీ సన్నిధాన ||2||
పాపపు చెలిమి పిలుచుచున్నది
చీకటి బలము లాగుచున్నది ||2|| ||ఆకర్షించుము||
4. జీవజలాల ఊటలతో మా తోట తడుపుము దేవా
తియ్యని తేనీయ మాటలతో మా నోరు నింపుము దేవా ||2||
సుమమధుర సహవాసముతో
సాగెద నిరతము నీ సేవలో ||2|| ||ఆకర్షించుము||
Create Your Own Website With Webador