Aakaashamandhu Neevu Thappa - ఆకాశమందు నీవు తప్ప

ఆకాశమందు నీవు తప్ప ప్రభువా

ఎవరు ఉన్నారు వేరెవ్వరు ఉన్నారు ||2||

నీవు మాకుండగా లోకములోనిది ఏదియు మాకు అక్కరలేదే

ప్రభువా నీవు మాకుంటే చాలు ||2||   ||ఆకాశ||

1. ఆకాశాము నీ సింహాసనము

ఈ భూమి నీ పాదపీఠము ||2||

నిన్ను నేను స్తుతియించెదను

నిత్యము నిన్నే కొనియాడెదను ||2||  ||ఆకాశ||

2. నా తల్లిదండ్రులు  - నన్ను విడనాడినా

నా బంధు స్నేహితులు  - మరచిపోయిన ||2||

మరువనంటివే విడువనంటివే

ప్రేమతో నన్నూ ఆదరించినావే ||2||  ||ఆకాశ||