Aadharam Neeve Aadharana Neeve - ఆధారం నీవే ఆదరణ నీవే

ఆధారం నీవే - ఆదరణ నీవే

ఆశ్రయము నీవే నా యేసయ్యా       ||2||

నన్నావరించి నడిపించు మేఘమా

నా ముందు నడిచే అగ్ని స్థంభమా.   ||2||  ||ఆధారం||

1. నన్నెంతగానో ప్రేమించి నీవు

గొల్వతా కొండకు నను మోసినావు  ||2||

అమరత్వానికి మార్గము చూపిన

పునరుత్థానుడా స్తోత్రము.              ||2||  ||ఆధారం||

2. నిజమైన స్నేహితునిగా దరిచేరి

నీలోని సుగుణాలు బోధించితివే    ||2||

నీ సహవాసమే మనిషిగ మార్చినది

సుగుణాల సంపన్నుడా స్తోత్రము  ||2||  ||ఆధారం||

3. నా దాగుచోటు నీవే యేసయ్యా

ఏ తెగులు ఎన్నడు దరిచేరనియ్యవు  ||2||

నా ఎదుగుదలకు పందిరి నీవే

నా క్షేమాధారమా స్తోత్రము   ||2||  ||ఆధారం||