Shruthi Chesi ne Paadana - శృతి చేసి నే పాడనా



శృతి చేసి నే పాడనా - స్తోత్రగీతం
భజియించి నే పొగడనా - స్వామీ ||2||
హల్లెలూయా.. హల్లెలూయా..
హలెలూయ హలెలూయ - హల్లెలూయా||2||   ||శృతి ||

1. దానియేలును సింహపుబోనులో - కాపాడినది నీవే కదా||2||
జలప్రళయములో నోవాహును కాచిన - బలవంతుడవు నీవే కదా||2||
నీవే కదా - నీవే కదా
హల్లెలూయా.. హల్లెలూయా..
హలెలూయ హలెలూయ - హల్లెలూయా||2||.  ||శృతి ||

2. ఇశ్రాయేలును ఐగుప్తు నుండి - విడిపించినది నీవే గదా ||2||
ఎర్ర సముద్రము పాయలు చేసి - నడిపించినది నీవే గదా||2||
నీవే కదా - నీవే కదా
హల్లెలూయా.. హల్లెలూయా..
హలెలూయ హలెలూయ - హల్లెలూయా||2||.  ||శృతి ||

3. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన - సత్యవంతుడవు నీవే కదా||2||
పాపులకొరకై ప్రాణము బెట్టిన - కరుణామయుడవు నీవే కదా||2||
నీవే కదా - నీవే కదా
హల్లెలూయా.. హల్లెలూయా..
హలెలూయ హలెలూయ - హల్లెలూయా||2||.  ||శృతి ||


Create Your Own Website With Webador