Sajeevudavaina Yesayya - సజీవుడవైన యేసయ్యా
సజీవుడవైన యేసయ్యా నిన్నాశ్రయించిన నీవారికి -
సహాయుడవై తృప్తిపరచితివే - సముద్రమంత సమృద్ధితో ||2||
ఆనందించెద నీలో - అనుదినము కృపపొంది
ఆరాధించెద నిన్నే - ఆనంద ధ్వనులతో ||2|| ||సజీవుడవైన||
1. ధనరాసులే ఇల ధనవంతులకు ఈలోకభాగ్యము
దాచినమేలులెన్నో దయచేసినావే - ఇహపరమున నాకు ||2||
శ్రమల మార్గమును - నిరీక్షణ ద్వారముగ చేసితివే
శ్రేష్ఠమైననీ వాగ్దానములతో ||2|| ||సజీవుడవైన||
2. క్షేమము నొందుటయే సర్వజనులకు ప్రయాసగామారె
క్షేమాధారమునీవై దీర్ఘాయువుతో - సంతృప్తి పరతువు నన్ను ||2||
నిత్యనిబంధనగా నీవాత్సల్యమును చూపితివే
నిత్యమైననీ సత్యవాక్యముతో ||2|| ||సజీవుడవైన||
3. నలువది యేండ్లు నీస్వాస్థ్యమును మోసినది నీవే
నీ కృపా కాంతిలో నాచేయివిడువక - నడిపించుచున్నది నీవే ||2||
పరమరాజ్యములో మహిమతోనింపుటకు
అనుగ్రహించితివే పరిపూర్ణమైన నీ ఉపదేశమును ||సజీవుడవైన||
Create Your Own Website With Webador