Prabhuvaa Neelo Jeevinchutaa - ప్రభువా నీలో జీవించుట

ప్రభువా నీలో జీవించుట
కృపా బాహుల్యమే
నా యెడ కృపా బాహుల్యమే        ||ప్రభువా||

1. సంగీతములాయె
పెను తుఫానులన్నియు ||2||
సమసిపోవునే నీ నామ స్మరణలో ||2||
సంతసమొందె నా మది యెంతో ||2||       ||ప్రభువా||

2. పాప నియమమును
బహు దూరముగా చేసి ||2||
పావన ఆత్మతో పరిపూర్ణమైన ||2||
పాద పద్మము హత్తుకొనెదను ||2||       ||ప్రభువా||

3. నీలో దాగినది
కృప సర్వోన్నతముగా ||2||
నీలో నిలిచి కృపలనుభవించి ||2||
నీతోనే యుగయుగములు నిల్చెద ||2||       ||ప్రభువా||

4. నూతన వధువునై
శుద్ధ వస్త్రములు ధరించి ||2||
నూతనమైన శుభాకాంక్షలతో ||2||
నూతన షాలేమై సిద్దమౌదు నీకై ||2||       ||ప్రభువా||

 

 

Create Your Own Website With Webador