Naa Svasthyamaina Paralokamu - నా స్వాస్థ్యమైన పరలోకము

నా స్వాస్థ్యమైన పరలోకము

ఎప్పుడు చేరెదనో

సౌందర్య సీయోనులో

నా ప్రభువైన యేసయ్యను

రారాజుగా నా కన్నులతో

ఎప్పుడు చూచెదనో

1. మహోన్నతుడా - తేజోనివాసి

మహిమానంత విడిచి ||2||

నాకోసమే - దిగి వచ్చిన ప్రేమసాగరా

నా కోసమే పోరాడి

చెరనుండి విడిపించినవా ||2||

2. మహా ఘనుడా - మహిమా స్వరూపి

స్తుతి మహిమలు నీకే ||2||

నా కాలుజారే చోటు నుండి

నీ తేజో మహిమ నిలిచె

సంఘములో నన్ను నిలిపిన

నా మహిమైశ్వర్యమా ||2||

3. మహనీయుడా - మహానందమే

కడవరి పిలుపులో ||2||

ఆత్మయు - పెండ్లి కుమార్తె

రమ్మనె పిలుపు కోసం

నే వేచి యుండెదను

నీకృప తోడుండగా ||2||