Maata ichi thappanivadavu - మాట ఇచ్చి తప్పనివాడవు

మాట ఇచ్చి తప్పనివాడవు నీవే యేసయ్య

వేనోళ్ళ స్తుతించిన నీ ఋణము తీరదయ్య    ||2||

వాగ్దానాపూర్ణుడ దయగల నీ మాటలతో

ఇన్నాళ్లు ఇలలోనే బ్రతుకుచుంటిని    ||2||

1. నీ మాటకునే విధేయుడనై

కుడివైపున వల విసిరిన వెంటనే    ||2||

విస్తారమైన దీవెనలతో నన్ను నింపితివే    ||2||

నీ ఆజ్ఞల మార్గములో నడచి

పొందెద ఇంకెన్నో మేలులు    ||2||      ||మాట||

2. నీ చిత్తమునే చేయుట కొరకే

ఉన్నత పిలుపుతో నన్ను పిలిచి    ||2||

విస్తారమైన ప్రజలకు దీవెనగా నిలిపితివే    ||2||

నీ పిలుపును కాపాడుకొనుచు

నే సాగేద తుది శ్వాస వరకు    ||2||       ||మాట||

3. నీ మాటకాదని ఎటుపోగలను

కంటికి ఎవరు కానరాని చీకటిలో    ||2||

నను నడిపించుటకు ధ్రువతారగా నాలో వెలసితివే    ||2||

నీ కుడిచేతిలో తారగా వెలుగుచు

ప్రకటించేదా నిన్నే ప్రతి క్షణము    ||2||     ||మాట||