Krupa gala devaa dayagala raaja - కృపగలదేవా దయగల రాజా
కృపగలదేవా దయగల రాజా ॥2॥
చేరితి నిన్నే బహుఘన తేజా
నీ చరణములే నే కొరితిని
నీ వరములనే నే వేడితిని ॥కృపగలదేవా॥
సర్వాధికారి నీవే దేవా
నా సహకారి నీవే ప్రభువా
నా కోరికలే సఫలము చేసి
ఆలోచనలే నేరవేర్చితివి
అర్పి౦చెదను నా సర్వమును నీకే దేవా
ఆరాధించి ఆనందించెద నీలో దేవా ॥2॥ ॥కృపగలదేవా॥
1. త్రోవను చూపే తారవు నీవే
గమ్యము చేర్చే సారధి నీవే ॥2॥
జీవనయాత్ర శుభప్రదమాయే
నా ప్రతి ప్రార్థన పరిమళమాయే
నీ ఉదయ కా౦తిలో నను నడుపుము
నా హృదిని నీ శా౦తితో ని౦పుము ॥2॥ ॥కృపగలదేవా॥
2. కృప చూపి నన్ను అభిషేకి౦చి
వాగ్దానములు నెరవేర్చినావే ॥2॥
బహు వి౦తగా నను ప్రేమించినావే
బలమైన జనముగా నను మార్చినావే
నీ కీర్తి జగమంతా వివరింతును
నీ దివ్య మహిమలను ప్రకటింతును ॥2॥ ॥కృపగలదేవా॥
3. నా యేసురాజా వరుడైన దేవా
మేఘాల మీద దిగి వచ్చు వేళా
ఆకాశవీధిలో కమనీయ కా౦తిలో
ప్రియమైన స౦ఘమై నిను చేరెదను
నిలిచెదను నీతోనే సీయోనులో
జీవి౦తు నీలోనే యుగయుగములు ॥2॥ ॥కృపగలదేవా॥
Create Your Own Website With Webador