Bethlehemulo Sandhadi - బెత్లెహేములో సందడి
బెత్లెహేములో సందడి
పశుల పాకలో సందడి
శ్రీ యేసు పుట్టాడని
మహారాజు పుట్టాడని ||2|| ||బెత్లెహేములో||
1. ఆకాశములో సందడి
చుక్కలలో సందడి ||2||
వెలుగులతో సందడి
మిల మిల మెరిసే సందడి ||2|| ||బెత్లెహేములో||
2. దూతల పాటలతో సందడి
సమాధాన వార్తతో సందడి ||2||
గొల్లల పరుగులతో సందడి
క్రిస్మస్ పాటలతో సందడి ||2|| ||బెత్లెహేములో||
3. దావీదు పురములో సందడి
రక్షకుని వార్తతో సందడి ||2||
జ్ఞానుల రాకతో సందడి
లోకమంతా సందడి ||2|| ||బెత్లెహేములో||
Create Your Own Website With Webador